![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -272 లో.... శౌర్య ఆపరేషన్ కి కావాల్సిన డబ్బుని కావేరి కడుతుంది. డబ్బులు ఎవరు కట్టారని కార్తీక్, దీపలు రిసెప్షన్ కి వెళ్లి అడుగుగా అక్కడ కార్తీక్ కట్టారని ఉంటుంది. దాంతో వాళ్ళు షాక్ అవుతారు. నా పేరు మీద ఎవరు కట్టి ఉంటారని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే దూరంగా ఉన్న కావేరిని దీప చూస్తుంది. కార్తీక్ కి నేను వచ్చిన విషయం చెప్పకన్న విషయం దీప గుర్తుచేసుకుంటుంది.
దీప బయటకు వచ్చి.. కావేరిని కలుస్తుంది. మీరే కదా డబ్బు కట్టిందని అడుగుతుంది. ఎవరైతే ఏంటి నీ కూతురు బాగుంటే చాలు అని కావేరి అంటుంది. మీకు కట్టాల్సిన అవసరం ఏంటని దీప అడుగ్గా.. మీరు ఇలా బాధపడడానికి కారణం నేనే.. నేనే కనుక శ్రీధర్ ని పెళ్లి చేసుకోకపోయుంటే శివన్నారాయణ కాంచన అక్కని దూరం పెట్టేవాడు కాదు.. మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కావేరి అంటుంది. నా కూతురిని కాపాడారు.. మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని దీప అంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని దీపకి చెప్తుంది కావేరి.
మరోవైపు దీప డబ్బు కోసం ఫోన్ చెయ్యడం లేదని జ్యోత్స్న నే దీపకి ఫోన్ చేస్తుంది. నా కూతురికి ఆపరేషన్ జరుగుతుంది కార్తీక్ బాబు డబ్బు కట్టాడని దీప అనగానే.. జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పుడేనా.. ఏంటి శౌర్యకి ఆపరేషన్ జరుగుతుందా అని సుమిత్ర వస్తుంది. శివన్నారాయణ వచ్చి అదంతా అబద్ధమని అన్నావని జ్యోత్స్న ని అడుగుతాడు. అబద్ధం అనుకున్నా కానీ నిజం అంట.. నాకు ఇప్పుడే తెలిసింది.. సాయం చేద్దామని దీప కి కాల్ చేసానని జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది. శివన్నారాయణ గిల్టీగా ఫీల్ అవుతుంటే.. ఏంటి నాన్న సాయం చేసి ఉంటే బాగుండు అనుకుంటున్నారా.. మనుషుల నుండి మనం దూరంగా వెళ్తున్నామనిపిస్తుందని దశరథ్ బాధగా అంటాడు. మరొకవైపు ఎవరు డబ్బు కట్టి ఉంటారు.. మావయ్య గారు అయి ఉంటారా అని కాశీ అనగానే.. అయన అంత సీక్రెట్ గా కట్టి వెళ్ళేవాడు కాదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |